Thursday, 16 April 2026 06:15:24 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

సిపిఐ శత వసంతాల వేడుకల ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

9న బి.కొత్తకోట లో సిపిఐ శత వసంతాల వేడుకలను జయప్రదం చేయండి : సిపిఐ జిల్లాకార్య దర్శి పీ.ఎల్.నరసింహులు

Date : 02 March 2025 09:39 PM Views : 306

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - మార్చి 02 : వర్గ పోరాటాల సారథి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతవసంతాల వేడుకలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.ఎల్. నరసింహులు ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 11 గంటలకు స్థానిక పీటీయం రోడ్డు నందు శతవసంతాల వేడుకలకు సంబంధించిన ప్రచార గోడప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా పి.ఎల్. నరసింహులు,జిల్లా కార్యవర్గ సభ్యులు టి. కృష్ణప్ప లు మాట్లాడుతూ 1925 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ కాన్పూర్ పట్టణంలో పురుడు పోసుకున్నదని, సంపూర్ణ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడి అనేక మంది కమ్యూనిస్టు బిడ్డలను ప్రాణత్యాగం చేసిన పార్టీ సిపిఐ పార్టీ అంటూ కొనియాడారు. దున్నేవానికి భూమి కావాలని, బలిసిన పరాన్నభుక్తులైన జమీందారీ వ్యతిరేక పోరాటాలు చేసి భూసంస్కరణల చట్టాన్ని సాధించిందని, తెలంగాణ సాయుధ పోరాటం చేసి 4 వేల మంది కార్యకర్తల వీరమరణంతో నైజాం దొరల చెరలోని 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసిందని అన్నారు.ఆనాటి నుంచి నేటి వరకు అనునిత్యం కష్టజీవుల పక్షాన నిలబడి పాలకుల విధానాలపై సమరశీల పోరాటాలు చేస్తున్న పార్టీ సిపిఐ అని అన్నారు.బి.కొత్తకోట పట్టణం మరియు మండల లోని అనేక ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు చేసి విజయం సాధించిన పార్టీ సిపిఐ శతజయంతి ఉత్సవాలు బి.కొత్తకోట పట్టణంలో ఈ నెల తొమ్మిదవ తేదీ ఆదివారం ఘనంగా జరుగుతున్నాయని,ఈ వేడుకలకు జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ,రాష్ట్ర కార్యదర్శి,మాజీ శాసనసభ్యులు కే. రామకృష్ణ,పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్ రెడ్డి,జి.ఈశ్వరయ్య లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం.పెంచలయ్య మరియు జిల్లా నాయకత్వం పాల్గొంటున్నారని, ఆదివారం ఉదయం జరిగే ర్యాలీ మరియు బహిరంగ సభలో ప్రజానాట్యమండలి బృందం వారిచే సాంస్కృతి క ప్రదర్శనలు,వివిధ జానపద కళారూపాలు పాల్గొంటున్నాయని అన్నారు.పార్టీ కార్యకర్తలు, శ్రామికులు,కర్షకులు, యువకులు,విద్యార్థులు, మహిళలు,సానుభూతిపరులు అందరూ కూడా ఈ ఉత్సవాలలో పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎస్. బషీర్ ఖాన్,మండల నాయకులు జీ.రఘునాథ్, ఎం.అష్రఫ్అల్లీ, షమీవుల్లా,గంగులప్ప,,శ్రీరాములు,నరసింహులు,సోమశేఖర్, బావాజాన్,కిట్టన్న తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :