నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి : డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ సీఐ మహబూబ్ బాషా మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం రాయచోటి పట్టణంలోని శివాలయం వద్ద ట్రాఫిక్ సిఐ మహబూబ్ బాషా మరియు సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు వాహన తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురికి మొదటి హెచ్చరిక గాను జరిమానాను విధించారు. అలాగే వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పలువురు మైనర్లు వాహనాలను నడపడాన్ని గమనించిన సిఐ మెహబూబ్ భాష వారిని మైనర్ల సంబంధికులు పిలిపించి మైనర్లు వాహనాలు నడుపుట వలన జరిగే అనర్థాలను వారికి వివరించి మరొకసారి మైనర్లకు వాహనాలు ఇచ్చినయెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .
Admin
Namitha News