Thursday, 16 April 2026 04:30:44 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

జూనియర్ కళాశాల లెక్చరర్ వెంకటరమణ గుండెపోటు తో మృతి

పలువురు సంతాపం

Date : 16 January 2025 07:36 PM Views : 222

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 16 ః తంబళ్లపల్లె మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఎకనామిక్స్ లెక్చరర్ వి వెంకటరమణ (45) గుండెపోటుతో మృతి చెందాడు. తంబళ్లపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2008 నుండి వి వెంకటరమణ ఎకనామిక్స్ లెక్చరర్ గా పనిచేయడంతో పాటు విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అందించడంతోపాటు కళాశాల అభివృద్ధి కోసం సహచర లెక్చరర్లు సలహాలు, సూచనలతో తన వంతు సహకారం అందించి అందరి మన్ననలు పొందడం విశేషం. సంక్రాంతి సెలవులలో వెంకటరమణ తన కుటుంబ సభ్యులతో తన స్వగ్రామం అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎరుకల వారి పల్లెకు పండుగ కు తరలి వెళ్లారు. గత మూడు రోజులుగా సంక్రాంతి పండుగ తన కుటుంబ సభ్యులు, పిల్లలు, బంధువులు, స్నేహితులతో సంతోషంతో సరదాగా గడిపాడు. గురువారం ఉదయం చాతిలో నొప్పి రావడం తో హుటాహుటిన వెంకటరమణ ను మెరుగైన చికిత్స కోసం కడప ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వెంకటరమణ మృతి చెందాడు. ఆయనకు భార్యతో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. వెంకటరమణ మృతి తో భార్య పిల్లలు,కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంకటరమణ మృతి పై జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అమరేంద్ర కుమార్, లెక్చరర్లు వెంకట్రాముడు, చంద్రశేఖర్, మాధవరెడ్డి, వెంకటరమణ, సురేష్, సుప్రజ, సునంద, ఉషారాణి, మోపూరి లు సంతాపం ప్రకటించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :