నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి -జూన్ 29 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి నాయకుల సహకారంతో 300 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు వేగవంతం తో పాటు సూపర్ సిక్స్ అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం సఫలం అయిందని ఇదే అభివృద్ధి మంత్రంతో నూతన పార్టీ కమిటీ సభ్యుల సహకారంతో రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని చేయనున్నట్లు తంబళ్ల పల్లె టిడిపి ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత వైకాపా అవినీతి, అరాచక, దౌర్జన్య పాలనలో అధికారులను, ప్రజలను భయబ్రాంతులను చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీలు, సర్పంచులు ఏకగ్రీవం చేసుకొన్నట్లు చెప్పారు. నేటి మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మా ప్రభుత్వానికి దక్కినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఇసుక మాఫియా చేస్తే మేము ఉచితంగా ఇస్తున్నామని మా ప్రభుత్వంలో చేపట్టే ప్రతి పని పారదర్శకంగా చేపట్టి ప్రజల మన్ననలు పొందినట్లు చెప్పుకొచ్చారు. నాడు జల జీవన్ మిషన్ పనులు పక్కదో పడితే నేడు మా పాలనలో జలజీవన్ మిషన్ పనులు శాశ్వతంగా చేపట్టి తాగునీటి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. నేడు తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల్లో ప్రజల సమస్య పరిష్కారానికి ప్రజామోదంతో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. తంబళ్లపల్లి రైతాంగానికి హంద్రీనీవా ప్రాజెక్టు కాలవల మరమ్మతులు,నేడు ప్రతి గ్రామం లో సిమెంట్ రోడ్లు, తాగునీటి నీటి సమస్యలు, కచ్చా రోడ్లు, పారిశుధ్యం మెరుగు, గోకులాల నిర్మాణం, జూనియర్ కాలేజీల మంజూరు, పెద్దేరు కాలవల మరమ్మత్తులు, ముదివేడు ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, హార్స్లీ హిల్స్ అభివృద్ధికి నిధులు మంజూరు, కురబలకోట లో ప్రాసెసింగ్ యూనిట్n మంజూరు తోపాటు అదనపు పెన్షన్లు, పక్కా గృహాలు మంజూరు చేయడంతో పాటు భవిష్యత్తులో నియోజకవర్గంలోని నిరుద్యోగ సమస్య నిర్మూలనకు పారిశ్రామిక కారిడార్ నిర్మాణం, హార్స్లీ హిల్స్ మరింత అభివృద్ధి, మల్లయ్య కొండ, పెద్దేరు ప్రాజెక్టు, చెన్నకేశవ స్వామి ఆలయాలు అభివృద్ధితోపాటు ప్రముఖ పర్యాటక కేంద్రాలు గా గుర్తింపు,తంబళ్లపల్లె-ములకలచెరువు, తంబళ్లపల్లె-పెద్దమండెం డబుల్ రోడ్డు, కోసువారిపల్లి రోడ్డు మరమ్మతులు, శివపురం రోడ్డు, ప్రభుత్వ గెస్ట్ హౌస్ ల నిర్మాణం, చెరువులు , కాలువలు మరమ్మతులు, మహిళలకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తానన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం లోని 6 మండలాలలో పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా కె ఎస్ ఎస్ సభ్యులు, గ్రామ కమిటీ ఎన్నికలు సంబంధిత ఎన్నికల పరిశీలకులు క్షేత్రస్థాయిలో సజావుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నూతన కార్యవర్గం సహకారంతో పార్టీని గ్రామస్థాయి నుండి పటిష్టం చేయడానికి అందరిని కలుపు కొని ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందించి వారికి అండగా నిలబడతానన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం లో జనసేన, బిజెపి నాయకుల పూర్తి సహకారంతో ఏడాది కూటమి పాలనలో చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తెచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళతామన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం అభివృద్ధికి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డిల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Reporter
Namitha News