నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మద్యం పైన ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు పైన ఉండదా విద్యా దీవెనే పడకపోతే కాలేజీ ఫీజులు ఎలా కట్టాలి ఫీజు కడితేనే పరీక్షకు అనుమతి ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్ కుమార్ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న విద్య ,వసతి దీవెనలను అలాగే అమ్మ ఓడి నిధులను విడుదల చేసి ప్రస్తుత విద్యా సంవత్సరం కు సంబంధించి డిగ్రీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలలో పున ప్రారంభించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక మదనపల్లి పట్టణంలోని బీటీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వవహించడం జరిగింది. ఈ సందర్భంగా AISFఅన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మాధవ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో వేలాదిమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు అని అన్నారు. అయితే 2023,2024,25విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కళాశాలలో కళాశాల ఫీజులు కడితేనే పరీక్షకు అనుమతిస్తామని లేకపోతే పరీక్ష రుసుమును చెల్లించుకోమని కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను డిమాండ్ చేస్తున్నారు. ఇలా డిమాండ్ చేయడం వల్ల విద్యార్థులు తమ ఫీజులు చెల్లించే స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఘోష పట్టీ పట్టనట్లు దున్నపోతు పైన వర్షం కురిసినట్లు వ్యవహరిస్తుంది గతంలో ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారం వచ్చిన తర్వాత విద్యార్థుల గోషను పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని ఇలా చేయడం వల్ల అనేకమంది విద్యార్థులు తమ ప్రాణాలను వదిలేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆరోపించారు అదేవిధంగా పెండింగ్ లో ఉన్న విద్యా, వసతి, అమ్మ ఒడి బకాయలను విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తమ విద్యను అభ్యసించుకొని ఉన్నతస్థాయి విద్యను అభ్యసించడానికి వెళ్లాలంటే ఆ ఫీజులను కళాశాల యాజమాన్యాలకు చెల్లించలేక నానా తిప్పలు పడుతున్నారు అని ఆరోపించారు. యువగలం వేదికగా ఎం ఏ, ఎం కాo,పీజీ చదువుతున్న విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం పైనున్న శ్రద్ధ విద్యార్థుల జీవితాల పైన వారి భవిష్యత్తు పైన ఉండదా అని అయన ప్రశ్నించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు నెంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి అభ్యసించే విద్యకు దోహదపడలని అన్నారు అలా లేని పక్షంలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షురాలు గంగరాని,మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు కమలాకర్, కార్యదర్శి వినయ్ , ఎఐఎస్ఎఫ్ నాయకులు వెన్నెల,శ్రావణి,తేజేశ్వరీ,మంజుల, పురుషోత్తం తదితర నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News