Thursday, 16 April 2026 08:01:33 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

విజయవాడ వరద బాధితులను ఆదుకుంటున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా సేవలు అమోఘం...

ఎమ్మెల్యే షాజహాన్ బాష సేవలను ప్రశంసిస్తూ , స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం కు పాలాభిషేకం

Date : 14 September 2024 07:37 PM Views : 101

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -సెప్టెంబర్14 : విజయవాడలో పది రోజుల క్రితం వరదలు కారణంగా నీట మునిగి సర్వం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుమేరకు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష వారం రోజులు పాటు శ్రమించి 50 లక్షల రూపాయలు విలువైన నిత్యవసర సరుకులు, గ్యాస్ స్టవ్లులు,బట్టలు మూడు లారీలలో తరలించి వరద బాధితులను ఆదుకోవడం 175 మంది ఎమ్మెల్యేలలో ప్రత్యేక స్థానాన్ని సాధించారని మదనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశంసించారు.. శనివారం మదనపల్లి పట్టణం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ కూడలిలో జెసిబి వేణుఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు, ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కష్టమంటే చూడలేని వ్యక్తిగా, పేద ప్రజలను అభిమానించే మదనపల్లి శాసనసభ్యులు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తల సమన్వయంతో 50 లక్షల రూపాయల విలువైన నిత్యవసరాలను పోగుచేసి విజయవాడ వరద బాధితులకు రెండు రోజులుగా పంచి పెడుతుండటం ఆయన గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్న కార్యకర్తలను ప్రజలను ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటుందని నిరూపించిన వ్యక్తి షాజహాన్ భాష అని గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రంగస్వామి నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్,రామ్మూర్తి నాయుడు,పెరవల్లి మధు, పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి,నవీన్ చౌదరి,బిల్డర్ రామకృష్ణ, జీవీ నాయుడు, మేస్త్రి శ్రీనివాసులు, జేవి రమణ, రాయచోటి శశి కుమార్,చిప్పిలి చెన్రాయుడు,మాజీ కౌన్సిలర్ రాధా, పులి మహాలక్ష్మి,టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, శ్రీరామ వినోద్, భాస్కర్,ఆరిఫ్.పూలకుంట్ల హరి బాబు.పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు....

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :