Thursday, 16 April 2026 04:25:13 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ప్రతి నిరుపేదకు వైద్యం అందాలి - స్పెషలాఫీసర్ అమర్నాథ్ రెడ్డి

స్పెషల్ ఆఫీసర్ మండలం లో విశృతంగా తనిఖీలు

Date : 22 August 2025 08:15 PM Views : 227

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 22 ః తంబళ్లపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నిరుపేదకు సకాలంలో వైద్య సేవలు అందించాలని స్పెషల్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో పలు తనిఖీలతో సుడిగాలి పర్యటన చేశారు. ఆసుపత్రి లోని దంత వైద్యం, బాలింతల వార్డు, ఎక్స్ రే యూనిట్, ఓ.పి తనిఖీ చేసి రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం కస్తూరిబా గురుకుల పాఠశాలలో ఎంపీడీవో థామస్ రాజా, ఎంఈఓ త్యాగరాజు లతో మధ్యాహ్న భోజనం తనిఖీ తో పాటు రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చే మెనూ తో పాటు క్రమశిక్షణ తో కూడిన విద్య అందించాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో జరిగిన సమీక్ష ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి మనసుపెట్టి ఉద్యోగ ధర్మం నిర్వర్తించాలని సున్నితంగా హెచ్చరించారు. గృహ నిర్మాణాలలో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించడానికి చొరవ చూపాలని సూచించారు. ఆయన వెంట ఏఈ సుజాత, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వైద్య సిబ్బంది గ్లోరీ, ఎల్టి బాలాజీ, కస్తూరిబా గురుకుల అధ్యాపక బృందం పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :