నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 23 : రామసముద్రం మండల పోలీస్ స్టేషన్ లో మంగళవారం విలేకురుల సమావేశంలో యస్.ఐ మాట్లాడుతూ మండల పరిధిలో జరిగే దసరా నవరాత్రులు ఉత్సవాలను అనుమతి తీసుకొని చట్ట బద్ధంగా నిర్వహించుకోవాలి. మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు అనుమతి కోరినప్పుడు పోలీస్ శాఖ బందోబస్తూ అందిస్తుందన్నారు. దుర్గామాత విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్సై. డి. రమేష్ బాబు తెలిపారు. మండపాల నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విద్యుత్ శాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని.అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివాదాస్పద స్థలాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాత విగ్రహాలు ప్రతిష్టించకూడదని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని మండపం దగ్గర రాత్రి సమయాల్లో కొందరు కచ్చితంగా ఉండాలన్నారు.భక్తి భావంతో సాంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్కరూ పండగ జరుపుకోవాలని ఆయన సూచించారు. లౌడ్ స్పీకర్లు ప్రతిరోజు రాత్రి 10:00 నుండి ఉదయం 6 గంటల వరకు ఎట్టి పరిస్థితులను వినియోగించరాదని అసభ్యకరమైన అశ్లీల నృత్యాలు ప్రదర్శించరాదని ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని ఆయన సూచించారు.విగ్రహ ఊరేగింపులో ట్రాక్టర్ డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలి, సహాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఈ సమావేశంలో ఎస్సై రమేష్ బాబు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .
Admin
Namitha News