నమిత న్యూస్ - Andhra Pradesh / గుంటూరు : చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి తప్పిన ప్రమాదం గుంటూరు: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీకొట్టింది.. తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశానికి విజయవాడ వస్తుండగా.. ఆయన కారును గుంటూరు వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నానితో పాటు కారులో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడ్డారు. పార్టీ శ్రేణులు అధైర్యపడొద్దని, తాను క్షేమంగా ఉన్నానని నాని ప్రకటించారు.
Admin
Namitha News