నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అయోధ్య నగర్ లో ఉరి వేసుకొని టూవీలర్ మెకానిక్ మృతి. ఘటనపై రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మదనపల్లి పట్టణంలోని స్థానిక అయోధ్య నగర్ లో బుధవారం రాత్రి సమయంలో గుర్తుతెలియని యువకుడు ఉరివేసుకొని మృతి చెందాడు. గురువారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందివ్వడంతో పోలీసులు స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మృతి చెందిన యువకుడ్ని పేరు కొటాల వెంకటేష్ గా గుర్తించారు. కొటాల వెంకటేశ్వర ది కనికల తోపు అయితే కుటుంబ పోషణ కోసం మదనపల్లిలోని స్థానిక చౌడేశ్వరి నగర్ లో కాపురం ఉంటూ బైక్ మెకానిక్ గా పని చేస్తున్నాడు అని పోలీస్ ల దర్యాప్తుల తేలింది. మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Reporter
Namitha News