నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఏడాదిలోనే చేతులు ఎత్తేసిన కూటమి ప్రభుత్వం - సూపర్ సిక్స్ ఎక్కడ...... మదనపల్లె జిల్లా హామి ఏమైంది.... చేతగాని పాలన అంటూ విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయక ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డీ సాహెబ్ విమర్శలు గుప్పించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయడం లేదని ముఖ్యంగా తల్లికి వందనం పధకంలో రూ.2 వేలు కోత పెట్టడం దుర్మార్గం అన్నారు. మదనపల్లి మెడికల్ కాలేజ్, మదనపల్లి జిల్లా,బి టి కళాశాలను యూనివర్సిటీ, కడప బెంగుళూరు రైల్వే లైన్ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏడాది పాలనలో ఇచ్చిన సూపర్ సిక్స్ పతకాలను అమలు చేయలేక చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు. అన్నదాత సుఖీభవ ఎప్పుడూ అని నీలదీదసారు..ఫ్రీ బస్సు పధకం అమలు చేయడానికి ఏడాది సరిపోలేదా అని ప్రశ్నించారు. చెతగాని కూటమి ఎన్నికల హామీలు మరియు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. రాష్ట్రంలో కేవలం పోలవరం, రాజధాని రెండే కాదని ప్రజలకు ప్రతిఒక్కటీ అవసరమేనని.... పాలకులు రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలపైనా ద్రుష్టి సరించాలని... లేకపోతే మోసగాళ్లుగా ముద్ర వేసుకుంటారని హితవు పలికారు.... మదనపల్లిని జిల్లా గా ప్రకటించి, మెడికల్ కళాశాలను తొందరగా పూర్తి చేయాలనీ డిమాండ్ చేసారు.
Reporter
Namitha News