నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి :నమిత న్యూస్: డిసెంబర్ 19 అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం వండాడి గ్రామంలో రైతు సేవా కేంద్రం పరిధిలో ఉన్న ఈ పంట నమోదును పర్యవేచించిన జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ గురువారం రబీ సీజన్లో పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు రవి సీజన్లో ఈ పంట నమోదు తో పాటు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని రైతులను కోరారు .ఈ పంటను నమోదు చేయించుకోవడం వలన ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను రైతులు అర్హులవుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గీత వ్యవసాయ విస్తరణ అధికారి అనూష వండాడి గ్రామ రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News