నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పవిత్ర శుక్రవారం మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం కొండయ్యగారిపల్లి మదీనా మసీదులో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్..... స్దానిక వైసిపి నాయకులు, మత పెద్దల ఆహ్వానం మేరకు మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం కొండయ్యగారిపల్లి మదీనా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులు, స్దానికులు నిస్సార్ అహమ్మద్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం మత పెద్దలతో చర్చించారు. ప్రార్థనలలో పాల్గొన్న వారందరితో ప్రత్యేకంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. స్దానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిస్సార్ అహమ్మద్ తోపాటు రెడ్డిశేఖర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, అబ్దుల్లా సాబ్, ఖాదర్ సాబ్, హసన్ సాబ్, మౌలా, చాపల సయ్యద్ ఖాన్, లతీఫ్, అబ్దుల్ రౌఫ్, ముబారక్, ఇనాయత్ సాబ్, నూర్ మొహిద్దీన్, మక్రుద్దీన్, ఫక్రుద్దీన్, ఫక్రుద్దీన్, ఫక్రుద్దీన్, ఫక్రుద్దీన్, సాదిక్, యాసీన్, జబివుల్లా, తాజ్, హబీబ్, జైనుద్దీన్, సత్తార్ భాయ్ నాసిర్, మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News