నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 7 ః తంబళ్లపల్లె మండలం కన్నె మడుగు ఆవు దేవత ఆలయ వీరభద్ర స్వామి అందరివాడు. ఆలయ విగ్రహ ప్రతిష్టలో ప్రోటోకాల్ పాటించకపోగా ఓ వర్గం బుకాయింపులకు దిగడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని టిడిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగులచంద్ర, క్లస్టర్ ఇంచార్జ్ రెడ్డి కోట బి.ఎం.ఆర్,మాజీ జెడ్పిటిసి రామచంద్ర, రమణారెడ్డి,లు ఎద్దేవా చేశారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో టిడిపి నాయకులు విలేకరులతో మాట్లాడుతూ ఆలయానికి ఎండోమెంట్ నిధులు రూ 1.07 కోట్లు మంజూరు కాగా కన్నెమడుగు దాయాదులు కాంట్రిబ్యూషన్ తో ఆలయ నిర్మాణం జరిగితే విగ్రహ ప్రతిష్టలో ప్రోటోకాల్ పాటించక పోవడంపై మా నాయకుడు జయచంద్రారెడ్డి నిలదీస్తే వైకాపా నాయకులకు ఉలుకెందుకని ప్రశ్నించారు. రూ 86 లక్షలు ప్రభుత్వం నిధులు మా కూటమి ప్రభుత్వం మంజూరు చేస్తే ప్రోటోకాల్ ప్రకారం దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా మంత్రి, తంబళ్లపల్లి ఇన్చార్జిను పిలవకపోవడం కనీసం ఎండోమెంట్ అధికారుల అనుమతి లేకుండా వైకాపా చేసిన ప్రోటోకాల్ ఉల్లంఘన పై చర్యలు తప్పవని హెచ్చరించారు. కన్నె మడుగు దాయాదులు పవిత్రంగా చేసుకునే ఈ కార్యక్రమాన్ని వైకాపా నాయకులు రాజకీయరంగు పులిమి ప్రశాంతంగా ఉన్న తంబళ్లపల్లె లో చిచ్చు రేపడం పెద్దిరెడ్డి కుటుంబానికి దక్కినట్లు విమర్శించారు. వైకాపా నాయకులు ప్రోటోకాల్ ఉల్లంఘించినందుకు పవిత్రమైన వీరభద్ర స్వామి ఆలయ దాయాదులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో ఎక్కడ ప్రోటోకాల్ పాటించారా మా ఏడాది కూటమి పాలనలో విశేష అభివృద్ది సాధించామని జి జె ఎస్ అభివృద్ధి పనులు, ప్రోటోకాల్ పాటించడంలో గోపి దిన్ని దళితవాడ శిలాఫలకమే మీకు ప్రత్యక్ష సాక్ష్యం అని విమర్శించారు. ఇప్పటికైనా వైకాపా నాయకులు రాజకీయాల పేరుతో దేవుళ్ళు, ప్రజలను అడ్డుపెట్టుకొని చిచ్చు పెట్టాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అదేవిధంగా మచ్చలేని మా నాయకుడు జయచంద్రారెడ్డి పై అసభ్యకర పోస్టింగులు పెడితే సహించేది లేదని పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు.ఈ కార్యక్రమంలో జగదీష్, జయరాం రెడ్డి, శేఖర్ రెడ్డి,భాస్కర్, పాల్గొన్నారు.
Reporter
Namitha News