నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సంబేపల్లి : గిరిజనుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎనలేని కృషి... *ఎన్నికల ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి* గిరిజనుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.సంబేపల్లె మండలం పెద్దబిడికి కి చెందిన వైఎసఆర్ సిపి గిరిజన నాయకుడు మూడే మహేంద్ర నాయక్ చే రూపొందించబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార పోస్టర్ ను డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు తదితర నాయకులుతో కలసిశ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. జగన్ ప్రభుత్వం చేసిన మేలును ఇంతింటా వివరించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు యర్రపురెడ్డి బ్రహ్మానంద రెడ్డి,జిల్లా కార్యదర్శి మల్లికార్జున రెడ్డి,లక్ష్మీకర్ రెడ్డి, శ్రీనూ నాయక్,ఫయాజ్ అహమ్మద్,ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News