Thursday, 16 April 2026 07:59:52 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఐ.సి.డి.యస్. శాఖ ఉద్యోగులతో సమీక్ష సమావేశం

అంగన్వాడీ సెంటర్లు కు పిల్లలు వంద శాతం హాజరయ్యేటట్లు శ్రద్ధ చూపాలి , నాణ్యమైన భోజనం , బాల్యవివహాలను అరికట్టాలి

Date : 07 August 2024 11:23 PM Views : 132

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అంగన్వాడి సెంటర్లకు పిల్లలు వంద శాతం హాజరయ్యేటట్లు చూడాలి! *పిల్లలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంగన్వాడి కేంద్రంలో ఉండాలి* *పిల్లలకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన భోజనం ఇవ్వాలి* *ఎత్తు, బరువు తక్కువ ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి* బాల్యవివాహాల నిర్మూలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి! జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి! *రాయచోటి :నమిత న్యూస్: ఆగస్టు 7:-* అంగన్వాడి సెంటర్లకు పిల్లలు వంద శాతం హాజరయ్యేటట్లు చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అంగన్వాడి సిబ్బందికి సూచించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, సిడిపిఓలు, సూపర్వైజర్లు, బిపిసి, డి పి సి లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడి సెంటర్లలో పిల్లలు తప్పకుండా 100% హాజరయ్యేటట్లు చూడాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో ఉండేటట్లు చూడాలన్నారు. చిన్నారులకు ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన భోజనం ఇవ్వాలన్నారు. చాలామంది పేద పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వస్తుంటారని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతి చిన్నారి అంగన్వాడీ కేంద్రానికి వచ్చే విధంగా చూపాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులందరికీ మంచి విద్య నేర్పించి వారు బాగా చదువుకునేటట్లు చూడాలన్నారు. ప్రతి ఒక్కరు విద్యావంతులైతేనే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అంగన్వాడి కేంద్రంలో ఆయా మొదలుకుని సూపర్వైజర్ వరకు చిన్నారుల అటెండెన్స్ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి రాకపోయినా అటెండెన్స్ వేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్వాడి కేంద్రంలో చదివే చిన్నారులందరికీ ఆధార్ కార్డు ఉండటట్లు తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగన్వాడి కేంద్రాల బలపటానికి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతోందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి బాధ్యతగా తమ విధులు నిర్వహించాలన్నారు. అంగన్వాడి కేంద్రాలలో ఎత్తు,బరువు తక్కువగా ఉన్న పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటానికి గల కారణాలను గుర్తించి వారిని వైద్యాధికారి వద్దకు తీసుకెళ్లి బరువు, ఎత్తు తగ్గడానికి గల కారణాలను తెలుసుకొని తగు చర్యలు చేపట్టాలన్నారు.జిల్లాలో రక్తహీనత ఉన్న గర్భిణీలు, బరువు తక్కువ ఉన్న పిల్లల సంఖ్యను జీరో శాతానికి తీసుకురావడానికి తగు జరగా చెప్పటాలన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగినట్లయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. బాల్య వివాహాల వల్ల అమ్మాయి, అబ్బాయి జీవితం నాశనం అవుతుందని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. ఇకనుంచి మన జిల్లాలో ఒకటి కూడా బాల్య వివాహం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి శశికళ, సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, బిపిసిలు, డిపి సీలు తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :