నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : శుక్రవారం మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లి పంచాయతీ సింగన్నగారిపల్లి అక్బర్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్...... స్దానిక ముస్లింల ఆహ్వానం మేరకు సింగవారిపల్లి అక్బర్ మసీదులో మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్దానిక ముస్లింలతో కలిసి ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. పెద్ద సంఖ్యలో ముస్లింలు హజరై నిస్సార్ అహమ్మద్ కు స్వాగతం పలికారు. సింగవారిపల్లి గ్రామస్థులే కాకుండా సమీపంలోని గ్రామస్థులు పెద్ద సంఖ్యలో విచ్చేసి, నిస్సార్ అహమ్మద్ ను కలిసారు. సింగంవారిపల్లి వద్ద వైసిపి నాయకులు, వివిధ గ్రామాల మధ్య వచ్చిన వారితోపాటు స్థానికులతో సమావేశమై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. నిస్సార్ అహమ్మద్ తోపాటు మాజీ సర్పంచ్ నవాజ్, మహమ్మద్ రఫీ, మజర్, అయూబ్, సయ్యద్ సాబ్, ఇర్షాద్, కాలేషా, అమ‌్‌జాద్, ఆర్.టి.ఎ.నూర్, హబీబ్, నసీర్, ఎస్. ఖాన్, యూనస్, జబివుల్లా, మసీదు కమిటీ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News