నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 30 : దసరా సందర్భంగా త్రైత సిద్ధాంతం- ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక దుత్తలూరు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రామసముద్రం మండలం లోని నరసాపురం, రాగి మాకుల పల్లె, పెడ్రాజు పల్లె, రాగి మాకుల పల్లె కొత్తూరు, గోసువారిపల్లి, గౌను వారి పల్లి, నాగనపల్లి, తమకనపల్లి, దాసిరెడ్డి పల్లె, ఎల్లంపల్లి, చిన్నప్పల్లి, చింపిరి పల్లి,తదితర 13 గ్రామాల్లో త్రైత సిద్ధాంత భగవద్గీత , ఆధ్యాత్మిక గ్రంథముల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథం శ్రీకృష్ణుడి అసలైన జ్ఞానం ను తెలియజేస్తుందని, ప్రతి ఒక్కరూ కర్మ యోగం విశిష్టత, త్రైత సిద్ధాంత జ్ఞానం తెలుసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో భగవద్గీత ప్రచారం చేస్తున్నామన్నారు. మన శరీరంలో దేవుడు మూడు ఆత్మలు గా విభజింపబడి ఉన్నాడని జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ల గురించి తెలుసుకోవడమే త్రైత సిద్ధాంతం అని, భగవద్గీత లో కర్మయోగం, బ్రహ్మయోగం, భక్తియోగం అనేవి దైవ ధర్మాలు అవి కర్మ నుండి బయట పడేసి మనిషికి ముక్తిని ఇస్తాయన్నారు. భగవద్గీత లో ఇమిడి ఉన్నటువంటి త్రైత సిద్ధాంతం నేడు మధ్యాత్మ యోగ పురుషుని ద్వారా బహిర్గతం అయింది అని ప్రబోధ సేవాసమితి అధ్యక్షులు ప్రజలకు తెలిపారు. కార్యక్రమం లో త్రైత సిద్ధాంత-ప్రబోధ సేవాసమితి దుత్తలూరు కమిటీ అధ్యక్షుడు సభ్యులు జి.ప్రసాద్ గారు గారు, జి సుధాకర్ , జి పెంచల రత్నం, ఎం నాగమ్మ, మల్లీశ్వరి, కే వెంకటసుబ్బమ్మ, డి రమణయ్య, ఎస్ రమణమ్మ, జి మధుప్రియ, ఎం కొండారెడ్డి, ఎం పెద్ద కొండారెడ్డి, ఎం మమత లు పాల్గొన్నారు.
Admin
Namitha News