నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి :నమిత న్యూస్: మార్చి 31:- అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఆర్ అండ్ బి కార్యాలయం నందు ఆదివారం పదవి విరమణ సన్మాన సభ ఎస్ సయ్యద్ సాహెబ్ కు ఘనంగా జరిగినట్లు ఆర్ అండ్ బి: డి ఈ ఈ వెంకటసుబ్బయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాలు ఎంతో వినయంగా మన రహదారుల భవనముల శాఖ నందు మంచి పేరు తెచ్చుకోవడం గ్యాంగ్ మెన్ గా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సంస్థకు మంచి పేరు తెచ్చారని ఆయన అన్నారు సంస్థ నందు ప్రత్యేక ఉద్యోగస్తులు సయ్యద్ సాహెబ్ అడుగుజాడల్లో నడుచుకోవాలని ఆయన అన్నారు దేవుని దయ వల్ల ఆయురారోగ్యాలు తన భార్య పిల్లలు అందరూ సంతోషంగా జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలోసుండుపల్లి సెక్షన్ ఏ ఈ ఈ కుమార్ బాబు ఏ ఈ ఈ గిరీష్ రావు జానీ భాష కాంట్రాక్టర్లు రేపన రఘునాధ శ్రీనివాసులు ఆంజనేయులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News