నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -జనవరి20 : మదనపల్లె సమీపం లో గల మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ నందు సెమీకండక్టర్ తయారీకి ఈడిఏ (EDA) సాధనాల ఆచరణాత్మక ఉపయోగం అను అంశం పై ఐదు రోజుల వర్క్‌షాప్ ను సోమవారం ప్రారంభించారు. వర్క్‌షాప్ ను ప్రతిష్టాత్మకమైన ఐఈఈఈ (IEEE) వారు ఆద్వర్యం లో నిర్వహించినట్లు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవనీతకృష్ణన్, సీనియర్ అప్లికేషన్ ఇంజనీర్, డిజైన్ మరియు EDA సపోర్ట్, ఎంటుపుల్ టెక్నాలజీస్ - బెంగుళూరు పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలకు మరియు అకడమిక్స్ కి మధ్య అంతరం ను తగించడానికి మరియు పరిశ్రమల సమస్య ల పై రీసెర్చ్ ద్వార పరిష్కరించి సరైన ఆలోచనలతో ముందుకెళ్ళి, మంచి ఫలితాలను రాబట్టడానికి ఇటువంటి టూల్స్ ఎంతగానో ధోహద పడతాయని పెర్కున్నారు. ఇటువంటి అడ్వాన్స్ డ్ టూల్స్ కొనుగోలు చేసి పీజీ స్టూడెంట్స్ పరిశోధన లు అతిత్వరగా పూర్తి చేయుటకు మంచి అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత పోటీప్రపంచంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లతో పోలిస్తే ఈసీఈ విభాగము విద్యార్థులకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని, ముక్యంగా వి.ఎల్.ఎస్.ఐ మరియు ఎంబెడెడ్ సిస్టమ్స్ పై మెండుగా ఉన్నాయని ఆయన అన్నారు. ప్రస్థుతం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్యాబ్ సిటీస్ మంజూరు చేసారని, అవ్వని నిర్మాణ దశ లో ఉన్నాయని త్వరలో అవి అందుబాటులోకి వస్తాయని అన్నారు. వి.ఎల్.ఎస్.ఐ ఈ డి ఏ (VLSI EDA) టూల్స్ పై మనం అవగాహన పెంచుకొని, పరిశోధనలు చేయాలనీ ఆయన అన్నారు. ప్రస్థుతం ఏ ఫ్యాబ్రికేషన్ కి అయినా మనం ఇంటెల్(intel) కంపెనీ పై ఆధారపడి ఉన్నాం అని అన్నారు. మన ఇండియాలో కొత్త టెక్నాలజీ కి సరైన అవగాహన లేధని ఇటు వంటి వర్క్‌షాప్‌లకు హాజరవడం వళ్ల ఇండస్ట్రీలో జరుగుతున్న పరిశోదనలను విద్యార్థులు తెలుసుకొని తధ్వర అధునాతన సాధనాల తో నూతన పరిశోధనలు చేయాలనీ ఆయన అన్నారు. కార్యక్రమం లో విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్, కో ఆర్డినేటర్ డాక్టర్ నాగ జ్యోతి, డాక్టర్ నాగశ్వేత, చరన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News