నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 17 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని హెచ్ పి పెట్రోల్ బంక్, రైస్ మిల్ లలో యజమాని పాలబత్తుల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా దసరా ఆయుధ పూజ వేడుకలు నిర్వహించారు. ఈసందర్బంగా పెట్రోల్ బంకు, రైస్ మిల్ లలో అమ్మవారికి పలురకాల పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. సుబ్రహ్మణ్యం కుమారులు శ్రీనివాసులు,చంద్ర, అల్లుడు వాలీ కుమార్తె కుటుంబ సభ్యులుచే హెచ్ పి పెట్రోల్ బంక్,రైస్ మిల్ లలో విద్యుత్ దీపాలు,పచ్చని తోరనాలు కట్టి అత్యంత వైభవంగా దసరా ఆయుధ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన అర్చకులు అనిల్ స్వామి వేదమంత్రాలతో వాహనాలకు, పనిముట్లు కు,పరిశ్రమలకు పూజలు నిర్వహించి పాలాబత్తుల కుటుంబ సభ్యులను అర్చకులు అనిల్ స్వామి ఆశీర్వాదములతో దీవించి తీర్థ ప్రసాదాలు అందజేశారు .
Admin
Namitha News