Thursday, 16 April 2026 04:25:15 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో ఘనంగా ఇంజనీరింగ్ డే నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి

Date : 15 September 2025 05:24 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో ఘనంగా ఇంజనీర్స్ డే అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో సోమవారం (15-09-2025) ఇంజనీర్స్ డే నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి లో ఇంజనీర్లు అందించే సేవలకు, సాంకేతిక నైపుణ్యాలకు కృతజ్ఞతలు తెలుపుటకు ఈ రోజు మనం ఇంజనీర్స్ డే జరుపుతున్నామని తెలిపారు. యువతను ఇంజనీరింగ్ వైపు ఆకర్శించడానికి, ఆవిష్కరణలు చేయడానికి సివిల్ ఇంజనీరింగ్ ఎంతగానో ఊయోగ పడుతుందని తెలిపారు. డీన్ ఆఫ్ స్టూడెంట్స్ ఏఫైర్స్ డా. ఎల్. తిమ్మయ్య మాట్లాడుతూ ఇంజనీర్లు భవనాలు, రోడ్లు, వంతెనలు, పరిశ్రమలు నిర్మించడం మరియు ఆధునిక సౌకర్యాలు లో కీలక పాత్రను వివరిస్తూ, భారత దేశానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సేవలను ఈరోజు గుర్తుంచుకోవాలని, ఇంజనీర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా పంచుతారో విద్యార్థులకు వివరించారు. ఎస్సే రైటింగ్ మరియు పోస్టర్ ప్రెసెంటేషన్ లో ప్రతిభను సాధించిన విద్యార్థులకు మూమెంటోస్ అందజేశారు. విశ్వం గ్రూప్స్ చైర్మన్ ఎం. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ లో మోక్ష గుండం విశ్వేశ్వరయ్య అతున్నత శిఖరాలు ను అధిరోహించి, ప్రపంచ ప్రక్యాత నిర్మాణాలను ఆవిష్కరించారాని, ఆయన ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల చైర్మన్ ఎం. ప్రభాకరెడ్డి, ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎపైర్స్ డా. ఎల్. తిమ్మయ్య హెస్. ఓ. డీస్, డీన్స్, అధ్యాపకులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :