నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కలకడ - మే25 : అడవి పందులను చంపడానికి తీసిన విద్యుత్ వైర్లు తగిలి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన కలకడ మండలం రౌతు కుంటలో ఆదివారం వెలుగుచుసింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. సంబేపల్లి మండలం, సోమవరంలో ఏకరి మురళి, నారాయణ నివాసం ఉన్నారు. రాత్రి కోమటివాని చెరువు సమీపానికి కుందేలు వేటకు ఇద్దరూ వెళ్ళగా, అప్పటికే అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు అడవి పందులను చంపడానికి విద్యుత్ వైర్లు ఉచ్చు తీసి ఉండడంతో ఆ ఉచ్చులో చిక్కి మురళి మృతి చెందాడు. నారాయణ తీవ్రంగా గాయపడడంతో రాయచోటికి తరలించారు. కలకడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు..
Admin
Namitha News