నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రేపు మదనపల్లె డివిజన్‌లో ప్రత్యేక విద్యుత్ అదాలత్ మదనపల్లె రూరల్ మేజర్ న్యూస్ మే 19: ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎ.పి.యస్.పి.డి.సి.ఎల్) ఆధ్వర్యంలో మదనపల్లె డివిజన్ పరిధిలో ప్రత్యేక విద్యుత్ అదాలత్‌ను రేపు అనగా మే 21 బుధవారం ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ అదాలత్ జరగనున్నదని ఎ.పి.యస్.పి.డి.సి.ఎల్ కార్యనిర్వాహక ఇంజనీరు యం. గంగాధరం తెలిపారు. ఈ ప్రత్యేక అదాలత్ మదనపల్లె ఆపరేషన్ డివిజన్ పరిధిలోని మదనపల్లె ఆపరేషన్, మదనపల్లె రూరల్ మరియు మొలకలచెరువు సబ్ డివిజన్లకు సంబంధించిన వినియోగదారుల ఫిర్యాదులపై దృష్టి సారించనున్నదన్నారు. ఈ కార్యక్రమం డివిజన్ ఆఫీస్ కాంపౌండ్, సీటీయం రోడ్డులోని కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ రిటైర్డ్ జడ్జి వి. శ్రీనివాస ఆంజనేయ మూర్తి, ఆర్థిక సభ్యులు కె. రామమోహన్ రావు, సాంకేతిక సభ్యులు యస్.ఎల్. అంజనీ కుమార్, స్వతంత్ర సభ్యులు డబ్లు. విజయలక్ష్మి అదాలత్‌ను పర్యవేక్షించనున్నారన్నారు. ఈ అదాలత్‌కు సంబంధించి సిజిఆర్ఎఫ్ (కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ ఫోరమ్) అధికారులు, సిబ్బంది హాజరుకానున్నారన్నారు. వినియోగదారులు తమ దీర్ఘకాలిక సమస్యలను వ్రాతపూర్వకంగా అందజేసి, ఈ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
Reporter
Namitha News