నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా ములకలచెరువు 9 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ రూ. ఒక లక్ష ₹1000 సీజ్ చేసిన పోలీసులు పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని ములకలచెరువు పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి ఎస్సై తిప్పేస్వామి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తంబళ్లపల్లి నియోజకవర్గం లోని ములకలచెరువు మండలం, కాల్వపల్లి వద్ద పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు మందస్తు సమాచారం అందింది అన్నారు. ఈ మేరకు సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరం పై దాడులు జరిపి 9 మంది జూదరులను పట్టుకోవడం జరిగిందన్నారు. అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద ఒక లక్ష ₹1000 సీజ్ చేసి జ్యోతిర్లను పోలీస్ స్టేషన్కు తీసుకు రావడం జరిగిందన్నారు. విచారణ అనంతరం వారిపై ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఎస్సై తెలిపారు
Admin
Namitha News