నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 5 : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు మెజారిటీ సాధించడంతో తంబళ్లపల్లె లో బుధవారం టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఎన్టీఆర్ అమర్ రహే, కాబోయే సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్రానికి శనిలా దాపురించిన వైకాపా ప్రభుత్వం మట్టి కరిసిందని, రాబోయే కూటమి పాలనలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారి ప్రజలు స్వేచ్ఛ వాయువులతో జీవించడం ఖాయమన్నారు. చంద్రబాబు నాయుడు సారధ్యంలో ప్రతి కుటుంబానికి ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందని హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గోపి దిన్ని ఉత్తమ రెడ్డి, బీసీ నాయకుడు చంద్ర,పురుషోత్తం, రామ్మోహన్ రెడ్డి, భాస్కర్, జగదీష్, సుధాకర్ రెడ్డి, గుండ్లపల్లి కాలా నారాయణ, కోసువారిపల్లె హరి, ముద్దలదొడ్డి మదన్ మోహన్ రెడ్డి, అప్పి రెడ్డి,రామచంద్ర, గట్టుమీద శంకర్ రెడ్డి, కోటకొండ బీసీ రెడ్డప్ప, చలపతి నాయుడు, బేరి శ్రీనివాసులు, జయరాం రెడ్డి, సోమశేఖర్, నరసింహులు, మ్యూజికల్ శివ, వందలాదిమంది టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Admin
Namitha News