నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - సెప్టెంబర్ 13 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు బి.టెక్ మెకానికల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరము చదువుతున్న విద్యార్థులకు ఇండస్ట్రియల్ విసిట్ లో భాగంగా ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి (IIT Tirupati) లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీసెర్చ్ ల్యాబ్ కు ప్రత్యేక పరిశ్రమ పర్యటన నిర్వహించారు. కార్యక్రమంలో పర్యటనలో భాగంగా ఐ ఐ టి ప్రొఫెసర్ డాక్టర్ మామిళ్ళ రవి శంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరికరాలు, డిజైన్ & మాన్యుఫాక్చరింగ్ ప్రక్రియలు, రోబోటిక్స్, ఆటోమేషన్ టెక్నాలజీలు, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ టెస్టింగ్ పద్ధతులు, 3D ప్రింటింగ్ టెక్నాలజీ, అలాగే సిములేషన్ మరియు రీసెర్చ్ ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యమని, పరిశ్రమలను సందర్శించడం ద్వారా అక్కడ జరిగే ఆధునిక పరిశోధనలపై అవగాహన పొందగలరని అన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధనలకు కావలసిన ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని, విద్యార్థులు వాటిని అందిపుచ్చుకోవాలని అన్నారు. అంతేకాకుండా విద్యార్థులు IIT తిరుపతి నిపుణులతో అక్కడ జరుగుతున్న ప్రాజెక్టులు, ఇండస్ట్రీ-అకాడమిక్ కలబోత అవకాశాలు, భవిష్యత్ పరిశోధన దిశలు, ఇంటర్న్‌షిప్‌లు, హైఎండ్ టెక్నాలజీ శిక్షణ అవకాశాల గురించి సమగ్ర అవగాహన పొందారు. పరిశోధనశాలలో జరుగుతున్న ఆధునిక ప్రయోగాలు, డెమోన్స్ట్రేషన్లు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని, జిజ్ఞాసను కలిగించాయి. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ కోఆర్డినేటర్స్ పి.రాజేష్, డాక్టర్ రూప శ్రీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Admin
Namitha News