నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 27 : అన్నమయ్య జిల్లా గాలివీడు మండల అభివృద్ధి అధికారి మనోహర్ పై రాజకీయ నాయకులు దాడి చేసి గాయపరచడం ప్రజాస్వామ్య కమని వెంటనే అతనిని అరెస్ట్ చేయాలని తంబళ్లపల్లె మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది డిమాండ్ చేశారు. శనివారం ఏవో థామస్ రాజా ఆధ్వర్యంలో సిబ్బంది మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసి ఎంపీడీవో పై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మునరాగం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్, సురేంద్ర, నవీన్, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News