నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 24 : తంబళ్లపల్లె మండల ఇంచార్జ్ ఎంపీడీవో గా ఏవో థామస్ రాజా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించి మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు. థామస్ రాజా మాట్లాడుతూ తంబళ్లపల్లె మండల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్యాలయ సిబ్బంది తోబాటు అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. థామస్ రాజాను ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి తో పాటు కార్యాలయ సిబ్బంది ఘనంగా సత్కరించి స్వాగతించారు. ఐకెపి ఏపిఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప ల ఆధ్వర్యంలో వారి సిబ్బంది బదిలీ ఎండిఓ ఉపేందర్ రెడ్డి, ఇంచార్జి ఎంపీడీవో థామస్ రాజాలను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్, టైపిస్ట్ సురేంద్ర, జూనియర్ అసిస్టెంట్ విజయ్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, ఐకెపి మహిళా సంఘ సభ్యులు, కార్యాలయ సిబ్బంది ఖయ్యూం, సౌమ్య, ఫామీద, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News