నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - అక్టోబర్ 24 : మదనపల్లి జెసిఎం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ సమావేశంలో పాల్గొన్న తంబల్లపల్లె టిడిపి ఇంచార్జీ దాసరిపల్లి జయ చంద్ర రెడ్డి . ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు సరైన పద్ధతిలో నడుచుకోవాలని మరియు ఏ పొరపాటు లేకుండా ప్రజలకు రేషన్ తదితరములను సకాలంలో పంపిణీ చేయాలని , ఏవిధమైన అవినీతికి రేషన్ డీలర్లు పాల్పడవద్దని గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలకు నాణ్యమైన రేషన్ సరుకులను ఇస్తుందని అది ప్రజలకు సరైన పద్ధతిలో సకాలంలో పంపిణీ చేసి ప్రజల మన్ననలు పొందాలని తెలియచేశారు . రేషన్ డీలర్లు ఏదైనా అవినీతికి పాల్పడితే ప్రభుత్వం వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవడంలో వెనకాడదని పేర్కొన్నారు. మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రేషన్ పంపిణీ సకాలంలో ఏ ఆటంకాలు లేకుండా ప్రజలకు చేరుతున్నాయని ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని తెలియచెప్పారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి , మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ భాష , రాష్ట్ర అధ్యక్షులు దివి లీల మాధవరావు గారు, టిడిపి పాలిటి బ్యూరో సభ్యులు రేషన్ డీలర్ల అధ్యక్షులు టీడీ జనార్ధన్ , జిల్లా రేషన్ డీలర్లు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News