నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 12 : తంబళ్లపల్లె యస్.ఐ ఉమామహేశ్వర్ రెడ్డి కి మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, టిడిపి నాయకులు కలిసి అశోకస్థంభం స్మారక చిహ్నం గౌరవార్థం బహుకరించారు. ఈ సందర్భంగా రెడ్డప్పరెడ్డి మాట్లాడుతూ ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డి శాంతి భద్రతల నిర్వహణ తోబాటు వినాయక చవితి నిర్వహణ, సమస్యల పరిష్కారంలో నిస్వార్ధంగా, నిజాయితీగా సేవ చేసినందుకు గాను ఈ జ్ఞాపికలను అందజేసినట్లు తెలిపారు. యస్.ఐ ఉమా మహేశ్వర్ రెడ్డి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ జ్ఞాపికలు దేశభక్తిని చాటి చెప్పే ప్రయత్నం చేయడం హర్షనీయమన్నారు. వారి వెంట టిడిపి నాయకులు నరసింహులు, మదనమోహన్, భాష, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News