Thursday, 16 April 2026 03:06:01 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు .... ఆరంభం జేడీ లక్ష్మీనారాయణ

Date : 29 December 2023 06:48 PM Views : 3935

నమిత న్యూస్ - Andhra Pradesh / NTRDistrict : నమిత న్యూస్ : విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన‌ అధ్యాయం కాద‌ని, ఇదే సిస‌లైన ఆరంభం అని జై భారత్ నేషనల్ పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. హోదాని సాధించేందుకు నాలుగుసార్లు మన ఎంపీలకు అవకాశం వచ్చినా, పార్టీలు వాటి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను పణంగా పెట్టాయ‌ని విమ‌ర్శించారు. రాష్టపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలపుడు మన ఎంపీలు ప్రత్యేక హోదాను ఎందుకు అడ‌గ‌లేక‌పోయార‌ని జేడీ ప్ర‌శ్నించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న హామీగా మ‌న రాష్ట్రానికి కేంద్రం ప్ర‌త్యేక హోదా క‌ల్పించి ఉంటే, పారిశ్రామిక అభివృద్ధి జ‌రిగి, నిరుద్యోగుల‌కు ఉపాధి దొరికేద‌న్నారు. ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో కేంద్రానికి ప్ర‌త్యేక హోదా డిమాండును వినిపించేందుకు జై భారత్ నేషనల్ పార్టీ ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తోంద‌ని జేడీ తెలిపారు. విజ‌య‌వాడ‌లో శుక్ర‌వారం నిర్వ‌హించిన స‌మావేశంలో జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌త్యేక హోదా బ్యాడ్జీని ధ‌రించి, ఉద్య‌మ నినాదాలు చేశారు. పొట్టి శ్రీరాములు బొమ్మ‌తో కూడిన బ్యాడ్జీ ధరించి, అంద‌రితో ప్ర‌త్యేక హోదా ఆత్మగౌరవ మహా ప్రతిజ్ఞ చేయించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మీ ఇంటికి ఓట్లు అడిగేందుకు వచ్చిన ప్ర‌తి పార్టీ నాయ‌కుడిని, ఈ బ్యాడ్జీ ధరించి ఆత్మగౌరవ మహా ప్రతిజ్ఞ చేయమని చెప్పాల‌ని పిలుపునిచ్చారు. జనవరి 26, 2024న ఆంద్రప్రదేశ్ వ్యాప్తంగా ఆంధ్రులంతా కలిసి సమైక్యంగా ప్రత్యేక హోదా ప్రతిజ్ణ చేయాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌త్యేక హోదాను సాకారం చేయ‌డంలో అటు కేంద్ర బీజేపీ, ఇటు రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ ఎంపీలు విఫ‌లం అయ్యార‌ని జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ విమ‌ర్శించారు. ఫైనాన్స్ క‌మిష‌న్ ఒప్పుకోవ‌డం లేద‌ని, కేంద్ర బీజేపీ చెపుతూ, ఆంధ్ర ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించింద‌ని ఆయ‌న ఆరోపించారు. పోర్టేట్ ఆఫ్ పవర్ గ్రంధకర్త ఎన్.కె.సింగ్ ప్రత్యేక హోదాకు ఫైనాన్స్ కమిషన్ లు అడ్డంకి కాదని తేల్చి చెప్పార‌ని వివ‌రించారు. తక్షణం గ్రామ‌గ్రామాన ఆంధ్రులు ప్రత్యేకహోదా సాధన కోసం ఆత్మగౌరవ మహాప్రతిజ్ఞ చేయాల‌ని జేడీ పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ మహాప్రతిజ్ఞ చేసేందుకు నిరాకరించిన పార్టీలకు, నాయకులకు ఓటు వేయబోమని కర్కశంగా చెప్పాల‌న్నారు. ఈ కార్యాచరణ విషయమై చర్చించేందుకు తాను అంద‌రికీ అందుబాటులో వుంటాన‌ని జేడీ అన్నారు. విద్యార్థులు, యువత, అధ్యాపకులు, హెయిర్ కటింగ్ సెలూన్స్, కిరాణ కొట్లు, పూలు, పండ్లు,కూరగాయల కొట్లు, టీ స్టాళ్ళు, టిఫిన్ సెంటర్లు, ఆటో క్యాబ్ డ్రైవర్లు, స్విగ్గీ జోమాటో, ర్యాపిడో, ఓలా రైడర్లు, బ్యూటీ పార్లర్లు ఇలా అంద‌రూ ప్ర‌త్యేక హోదా ఉద్యమంలో పాల్గొనాల‌ని జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో పోతిన వెంక‌ట రామారావు, న‌వ‌త‌రం పార్టీ అధ్య‌క్షుడు రావు సుబ్ర‌హ్మ‌ణ్యం, నేష‌న‌ల్ న‌వ‌క్రాంతి పార్టీ అధ్య‌క్షుడు క‌న‌కం శ్రీనివాస్, న‌వ‌రంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు జేకే జ‌లీల్, జ‌న స‌హాయ‌క శ‌క్తి సంఘం షేక్ ఉమ‌ర్ షాపా, ఆప్ జిల్లా అధ్య‌క్షుడు ప‌ర‌మేష్, రాష్ట్ర నాయ‌కులు జి.ఫ‌ణి రాజ్ త‌దిరులు పాల్గొన్నారు .

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :