Thursday, 16 April 2026 08:03:56 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

తంబల్లపల్లె ఘనంగా భోగి

భోగి మంటల చుట్టూ కోలాటాలు వేస్తున్న మహిళలు.

Date : 13 January 2025 07:40 PM Views : 213

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 13 ః తంబళ్లపల్లె మండలం లో సోమవారం గ్రామీణ ప్రాంత ప్రజలు భోగి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. భోగి పండుగ సందర్భంగా ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు అందులో గొబ్బెమ్మలు అమర్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని మారు మూల కుగ్రామాలలో సైతం భోగి పండుగ సందర్భంగా సాయంత్రం రైతులు పెద్ద ఎత్తున భోగి మంటలు వేసుకున్నారు. మండలంలోని పలు గ్రామాలలో మల్లికార్జున స్వామి మహిళా కళాకారుల బృందం భోగి మంటలు చుట్టూ కోలాటాలు, గొబ్బెమ్మ పాటలతో సందడి చేశారు. పిల్లలు, పెద్దలు భోగి మంటలు చుట్టూ చేరి చలి కాచుకున్నారు. సంక్రాంతి సందర్భంగా సోమవారం పండుగ కోసం పూలు, పండ్లు, కూరగాయలు, ఇంటి సరుకులు ధరలు ఆకాశాన్ని అంటాయి. పండుగ సందర్భంగా చిన్నారుల నెత్తిన భోగి పండ్లు వేసి వారు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో అభివృద్ధిలోకి రావాలని పెద్దలు దీవించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :