Thursday, 16 April 2026 06:16:51 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మిట్స్ విద్యార్థికి జాతీయ స్థాయి హ్యాక్ పేస్ట్ 2k25 లో ద్వితీయ బహుమతి

Date : 03 April 2025 09:01 PM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్03 : కురబల కోట మండలం అంగళ్ళు వద్ద నున్న మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్‌ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్ ) బి.టెక్ రెండవ సంవత్సరము చదువుతున్న విద్యార్ధి సి.బాలాజీ పుత్తూరు సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన జాతీయ స్థాయి హ్యాక్ ఫెస్టా 2K25 పోటీలలో ప్రతిభ కనపరచి రెండవ బహుమతిగా పదిహేనువేలు నగదు పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. ఈ హ్యాకథాన్ లో విద్యార్థులు, స్టార్టప్ లు, టెక్నాలజీకి సంబంధిచిన తమ సృజనాత్మకతను, సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని పొందారన్నారు . ముఖ్యంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషీన్ లెర్నింగ్ (ML), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై చర్చలు, ప్రాజెక్టుల అభివృద్ధి, ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ టెక్నాలజీ నిపుణులు, పరిశ్రమ నాయకులు, శాస్త్రవేత్తలు హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్సు విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. భాస్కర్ సహాయ సహకారంతో ప్రతిభ కనపరిచిన బాలాజీ ని విభాగాధిపతి డాక్టర్ కుసుమ, కళాశాల కరెస్పాండంట్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ తదితరులు అభినందనలు తెలియజేసారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :