నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : పుంగనూరు : పుంగనూరు నియోజకవర్గంలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి పర్యటన నేడు రెండవ రోజు కొనసాగుతున్న కార్యక్రమం. .... నారా చంద్రబాబు అక్రమ అరెస్టు ను జీర్ణించుకోలేక మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు తాము మీకు అండగా ఉంటామని తెలియచేస్తూ ఓదార్పు నివ్వ నున్న నారా భువనేశ్వరి ... పులిచెర్ల మండలం లోని కమ్మ పల్లె గ్రామంలోని సండ్ర వెంకటపతి నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి , వారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ , వారి కుటుంబం కు కొద్దిపాటి ఆసరాగా 3లక్షల రూ చెక్ ను అందించిన నారా భువనేశ్వరి .... పులిచెర్ల మండలం లోని గడ్డం వారి పల్లె పంచాయతీ లోని పడగల వారి పల్లె లోని చెంచే దొరస్వామి కుటుంబీకులను పరామర్శించి , వారికి భరోసా కల్పిస్తూ వారి కుటుంబసభ్యులకు కొద్దిపాటి ఆసరాగా 3 లక్షల రూ చెక్ ను అందించిన నారా భువనేశ్వరి .. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరి వెంట మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి , నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి , నియోజకవర్గం ఇంచార్జీ చల్లా బాబు , అనీషా రెడ్డి , ఇతర తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ....
Admin
Namitha News