నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 08 : రామసముద్రం ఎంపీడీవో కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాష . రామసముద్రం మండలం పంచాయతీలో చేసిన అభివృద్ధి గురించి మరేమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకుని వాటిని నోటిఫై చేసి తక్షణమే సమస్యలు పరిష్కరించి నూతనంగా రోడ్లు కాలువలు వీధి దీపాలు మంజూరు చేయాల్సిన వాటికి అనుమతులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా , సర్పంచ్ లు , ఎంపీటీసీలు , తెలుగుదేశం పార్టీ నాయకులు, రామసముద్రం మండల గ్రామ ప్రజలు , ఎంపీడీవో, ఎంఆర్ఓ ,వీఆర్వోలు, పంచాయతీ సెక్రెటరీలందరూ పాల్గొన్నారు...
Admin
Namitha News