నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - జనవరి 03 : మొలకలచెర్వు మండల పరిషత్ కార్యాలయం కు గురువారం 2వ తేదీన మండల సర్వసభ్య సమావేశం కు సభ్యులు ఎవరూ హాజరుకాకపోవడం తో సమావేశం ను వాయిదా వేసిన తర్వాత 11.30 గం సమయంలో కార్యాలయంలోకి వచ్చిన జడ్పీటీసీ దాసరిపల్లె మోహన్ రెడ్డి , మరికొందరు ఎంపీటీసీలు కార్యాలయంలోకి వచ్చి నావద్ద నున్న మండల పరిషత్ తీర్మానాల పుస్తకం ను మాకార్యాలయం సిబ్బంది చూస్తుండగానే లాక్కొన్నారు , పోలీసుల జ్యోక్యం తో పుస్తకం నాకు చేరినది . నన్ను దుర్బాషలాడి , భయబ్రాంతులకు గురిచేస్తూ నా విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మొలకలచెర్వు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీడీఓ హరినారాయణ . ఎంపీడీఓ ఫిర్యాదు పై జడ్పీటీసీ మోహన్ రెడ్డి తదితర ఎంపీటీసీ లపై కేసు నమోదు చేసిన మొలకలచెర్వు పోలీసులు .
Admin
Namitha News