Thursday, 16 April 2026 06:19:32 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

తహశీల్దార్ కార్యాలయం లో విద్యుత్ షార్ట్ సర్కూట్

పెచ్చులూడిన పై కప్పు

Date : 17 October 2024 07:48 PM Views : 314

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 17 : తంబళ్లపల్లె తహశీల్దార్ కార్యాలయం శిధిలావస్థకు చేరుకుని కూలడానికి సిద్దంగా వుంది. కార్యాలయం తేలికపాటి వర్షానికి పైపెచ్చులూడి నీటి మడుగులు ఏర్పడి రికార్డులు సైతం తడిసిపోతున్నాయి. ఈ కోవలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి తాసిల్దార్ కార్యాలయంలో గదులన్నీ పూర్తిగా నీటిమడుగు లయ్యాయి. ఈ కోవలో బుధవారం అర్ధరాత్రి కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి వైర్లు దగ్ధం అవుతుండగా కార్యాలయంలోని సిబ్బంది హుటాహుటిన తాసిల్దార్ హరిప్రసాద్ కు సమాచారం అందించారు. వెంటనే తాసిల్దార్ కార్యాలయం చేరుకొని విద్యుత్ సరఫరా ఆపివేసి తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. గత నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన తహసిల్దార్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని చినుకు పడితే కార్యాలయంలోని గదులన్నీ నీటిమడుగులను తలపిస్తాయి. గత ఐదేళ్ల క్రితం అప్పటి టిడిపి ప్రభుత్వం తాసిల్దారు కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అయితే అప్పట్లో నిధులు చాలవని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో కార్యాలయ పరిస్థితి మరింత దిగజారింది. తాసిల్దార్ కార్యాలయ దుస్థితిపై పలుమార్లు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకున్న దాఖలు లేవు. ప్రతినిత్యం అధికారులతో పాటు వందలాదిమంది కక్షిదారులు కార్యాలయానికి వస్తూపోతుంటారు. వర్షం పడితే అధికారులే బిక్కు బిక్కుమంటూ కాలం వెలదీసే దుస్థితి నెలకొంది. ఇక కక్షిదారులైతే కార్యాలయం లోకి వెళ్లడానికి సాహసం చేసేవారు కాదు. గతంలో పలుమార్లు కార్యాలయం పై కప్పు పెచ్చులు ఊడి చిన్నపాటి ప్రమాదాల సైతం జరిగిన దాఖలాలు ఉన్నాయి. గత రెండేళ్ల క్రితం అప్పటి తాసిల్దార్ కార్యాలయాన్ని తాత్కాలికంగా అద్దె భవనంలోకి మార్చడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. కనీసం పాత ఎస్టి బాలికల హాస్టల్ భవనంలోకి మార్చడానికి సైతం చేసిన ప్రయత్నం జరగలేదు. గురువారం కార్యాలయం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అధికారులు పనులు నిలిపివేసి లోపలికి వెళ్లడానికి భయపడి కార్యాలయం బయట వేచి చూడక తప్పలేదు. ఇప్పటికైనా నూతన ప్రభుత్వం తాసిల్దారు కార్యాలయాన్ని తాత్కాలికంగా వేరే చోటికి మార్చి నూతన భవన నిర్మాణానికి కృషి చేయాల్సి ఉంది.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :