నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్ 23 : తంబళ్లపల్లె మండల విద్యుత్ శాఖ ఎఈగా బాధ్యతలు చేపట్టేదానికి విచ్చేసిన సురేంద్రకు స్థానిక విద్యుత్ శాఖ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. గత ఐదేళ్లుగా తంబళ్లపల్లె మండలానికి విద్యుత్ శాఖకు ఎఈ లేకపోవడం తో ఇబ్బందులు ఎదురయ్యాయి. బుధవారం సత్యసాయి జిల్లా నల్లచెరువు నుండి సురేంద్ర తంబళ్లపల్లె ఎఈగా బాధ్యతలు చేపట్టడంతో సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సబ్ ఇంజనీర్ శేషుబాబు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది దృశ్యాలవలు, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు అందజేశారు. ఏ ఈ సురేంద్ర సహచర ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతూ మండలంలోని విద్యుత్ శాఖ కు సంబంధించిన రైతులు, వ్యాపారులు, కక్షిదారుల సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తన సహచర సిబ్బంది సహకారంతో కృషి చేస్తానని కిందిస్థాయి సిబ్బంది తనకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఈలు రామ లక్ష్మణ్, ప్రసాద్, మస్తాన్, ఎంఈఓ త్యాగరాజు, ఎల్ ఐలు భాస్కర్, నాగరాజు, లైన్మెన్లు అప్పిరెడ్డి, శంకర,సిబ్బంది ఖాజా పీర్,ఆమీన్, నాగేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, భాస్కర్, ఇంతియాజ్, కాలేశా, సురేష్, నాగేంద్ర, నాలుగు సబ్ స్టేషన్ ల పరిధిలోని విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News