నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 9 : గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన తంబళ్లపల్లె నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్వర్ణాంధ్ర 2047 సాధనకు ఆరు మండలాల అధికారులు కలసి రావాలని కోరారు. సోమవారం తంబళ్లపల్లెలో జరిగిన ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులతో ఫోన్లో మాట్లాడారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లో సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, నిరుద్యోగం, రైతులకు గిట్టుబాటు ధర, ప్రతి ఒక్కరికి పని, మహిళలకు రక్షణతో పాటు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నా వంతు పూర్తి సహకారం అందిస్తానని తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు సైతం తంబళ్లపల్లె అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కలసి రావాలని కోరారు. ఇప్పటికే తంబళ్లపల్లి అభివృద్ధిలో అధికారుల పాత్ర మరువలేనని భవిష్యత్తులో అధికార యంత్రాంగం సమిష్టి కృషితో మరింత ప్రోత్సాహకరంగా సహకరిస్తే పార్టీలు, ప్రాంతాలకతీతంగా అభివృద్ధిలో ఆగ్రస్థానాన తంబళ్లపల్లె నిలిపి ముఖ్యమంత్రికి కానుకగా ఇద్దామని ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుకు నియోజకవర్గంలోని ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడు తంబళ్లపల్లె అభివృద్ధి, సంక్షేమానికి అధికారులతో ఐకమత్యం, సమన్వయం తో ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందించాలని ఇందుకు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహకరిస్తానన్నారు.
Reporter
Namitha News