నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి జూలై 30 : తంబళ్లపల్లె మండలం లో ఆగస్టు 1వ తేదీ సామాజిక వృద్ధాప్య, వితంతు , దివ్యాంగులు, ఒంటరి మహిళలు పెన్షన్లు సాయంత్రానికి 100% పంపిణీ కోసం సచివాలయ అధికార యంత్రాంగం కృషి చేయాలని ఎంపీడీవో కృష్ణమూర్తి సూచించారు. మంగళవారం ఆయన ఉద్యోగులతో సమీక్ష జరిపి జూలై 31వ తేదీ బ్యాంకుల నుండి పెన్షన్ల మొత్తాన్ని డ్రా చేసి ఆగస్టు ఒకటో తేదీ ఉదయం 6 గంటల నుండి పెన్షన్లను ఇంటింటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరారు. ఒకటి అర లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే మరుసటి రోజు వారికి పెన్షన్లు అందించడానికి ముందు ఉండాలన్నారు. పెన్షన్ల లబ్ధిదారులు ఆగస్టు ఒకటో తేదీ కచ్చితంగా ఇండ్ల వద్దనే ఉండి పెన్షన్లు అందుకొని అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఈ సమీక్షలో ఈఓఆర్ డి దిలీప్ కుమార్ నాయక్, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్, వివేకానంద, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Namitha News