నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 21 ః తంబళ్లపల్లె మండలం లోని విద్యార్థులకు భవిష్యత్తులో బర్త్ సర్టిఫికెట్ తోపాటు ఎలాంటి సమస్యలు రాకూడదని ఇందుకు అపార్ అప్డేట్ తప్పనిసరిగా చేయించాలని ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి హెడ్మాస్టర్లకు సూచించారు. గురువారం మండలంలోని హెడ్మాస్టర్ లతో ఆయన సమీక్ష జరిపి అపార్ అప్డేట్ ద్వారా పాఠశాలల పరిధిలోని విద్యార్థులకు వివరాలు అందుబాటులోకి వచ్చి బాల కార్మికుల గుర్తింపు వారిని బడిలో చేర్పించే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు మండలంలో 75 శాతం అపార్ అప్డేట్ జరిగిందని ఇంకా 25% అప్డేట్ పూర్తి చేసే బాధ్యత అధ్యాపకులతో పాటు సచివాలయ సిబ్బంది సైతం సహకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజు, ఈ ఓ ఆర్ డి దిలీప్ కుమార్ నాయక్, మండలంలోని హెడ్మాస్టర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News