నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 15 : అంగళ్ళు సమీపం లోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ ( ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) విభాగం వారు ఐఈఈఈ (IEEE RAS) ఆర్ ఏ ఎస్ స్టూడెంట్ చాప్టర్‌తో కలిసి "ట్రెండ్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్" పై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరులోని డి ఆర్ డి ఓ (DRDO) లోగల సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ (CAIR) శాస్త్రవేత్త డి (D) శ్రీనివాసులు రెడ్డి రిసోర్స్ పర్సన్‌గా పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ రోబోలకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు, వాటి సేవలను ఆర్మీలో వినియోగించుకునేందుకు అవసరమైన సరికొత్త కృత్రిమ మేధస్సు పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి అభివృద్ధి చేశారు అని ఆయన అన్నారు. జాతీయ అభివృద్ధి, భద్రత మరియు పారిశ్రామిక ఆటోమేషన్ కోసం రోబోటిక్స్ తో కృత్రిమ మేధస్సును అనుసంధానించడం యొక్క ప్రాముఖ్యతను మరియు ఆవిష్కరణ, పరిశోధన మరియు ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ ద్వారా భారతదేశ సాంకేతిక పురోగతికి తోడ్పడాలని విద్యార్థులను ఆయన ప్రోత్సహించారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (GAI) వాడకం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది అని, కానీ సాంకేతికత అభివృద్ధి చెందుతూ మరియు మెరుగుపడుతున్న కొద్దీ దాని ప్రభావం పెరిగే అవకాశం ఉంది అన్నారు. భారత ప్రభుత్వానికి జి.ఏ.ఐ (GAI) కి సంబంధించిన సాంకేతికతల ఆవిర్భావం మరియు విద్య, తయారీ, ఆరోగ్య సంరక్షణ, ఆర్థికం మరియు ఇతర రంగాలలో వాటి వేగవంతమైన విస్తరణ గురించి ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ వర్క్‌షాప్ లో విద్యార్థులు, అధ్యాపకులు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ చొక్కనాదం, కో ఆర్డినేటర్ మహమ్మెద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News