నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 01 : రామసముద్రం మండలం లోని కాప్పల్లె గ్రామపంచాయతీ గజ్జలవారి పల్లె లో కనులపండవుగా వినాయక నిమర్జనం జరిగింది. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన గణేష్ నిమిజ్జన యాత్ర సాయంత్రం వరకు సాగింది.మేళతాళాల నడుమ పురవీదుల్లో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు స్వామివారికి మంగళ హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం యువతి యువకులు రంగులు చల్లుకుని కొలా హాలంగా జరుపుకున్నారు .కోవా కృష్ణమూర్తి ప్రసాదాలు అందజేశారు.గజ్జలవారిపల్లె గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు .నిమిజ్జనం వేడుకల్లో పాల్గొన్నా కోవాకృష్ణమూర్తి, విశ్వనాథ్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, మనోహరాచారి, పవన్, శంకర, తదితరులు పాల్గొన్నారు. నిమర్జనంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్సై డి. రమేష్ బాబు పోలీస్ సిబ్బంది బందోబస్త్ నిర్వహించారు. సాయంత్రం చెరువులో స్వామి వారిని నిమర్జనం చేశారు.
Admin
Namitha News