నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - అక్టోబర్ 15 : నాయునిచెర్వుపల్లె రోడ్డు , వినాయక నగర్ సి.సి.రోడ్డు కు భూమి పూజ చేసిన ఇంచార్జీ దాసిరిపల్లి జయచంద్రా రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుండీ ఆంధ్రప్రదేశ్ అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో 4,500 కోట్ల రూ వ్యయం తో గ్రామసభలలో ఆమోదం తెలిపిన పనులను చేయుటకు అక్టోబర్ 14 నుండి 20వ తేదీ వరకు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపాధి హామీ తదితరములతో పూర్తి చేయుటకు పల్లె పండుగ కార్యక్రమం చేపట్టింది . ఈ వారోత్సవాలలో భాగంగా తంబళ్లపల్లి నియోజకవర్గం అభివృద్ధి బాట వేయుటకు పలు గ్రామాల్లో ఎన్నో సంవత్సరాల నుండి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను మన కూటమి ప్రభుత్వం లో సిసి రోడ్లుగా మార్చే దిశలో ఈరోజు మొలకలచెరువు మండలం మొలకలచెరువు టౌన్ నందు నాయన చెరువు పల్లి వినాయక నగర్ సిసి రోడ్డును ప్రారంభించిన మన తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకు ముందడుగు వేస్తున్నామని , వాటిని కార్యరూపం లో అమలుపర్చటకే ఈ పల్లెబాట వారోత్సవాలు అని పేర్కొన్న జయచంద్రా రెడ్డి ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారితో పాటు ఎంపీడీవో హరినారాయణ , RWS సి.ఈ. దినేష్ , పి ఆర్ ఏ ఈ అనిత , ఏ ఈ నాగరాజు ,పారిశ్రామికవేత్త మంత్రి గిరిధర్ రెడ్డి , మంత్రి ప్రసాద్ రెడ్డి , టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు , మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కె.వి రమణ సర్పంచ్ ఎర్రగుడి సురేష్ గారు ఎక్స్ ఎంపీటీసీ నర్సింహారెడ్డి , మాజీ ఎంపీటీసీలు రామచంద్ర , చాంద్ బాష లు , పల్లా రాము శ్రీనివాసులు కట్టా సురేంద్ర నాయుడు మునిస్వామి రుద్ర బాలకృష్ణారెడ్డి , ఎంపీటీసీ వెంకట సిద్దయ్య షఫీ గంగాదేవి దయ్యాల శ్రీనివాసులు ఎక్స్ ఎంపీటీసీ రవి భాస్కర్ రెడ్డి పిడుగు రెడ్డప్ప కలుమూరి నాగభూషణ విశ్వనాథ్ రెడ్డి బేరి సీన మరియు కూటమి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News