మదనపల్లి - అక్టోబర్ 12 :
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని త్యాగరాజు కాలనీకి చెందిన దివ్యాంగురాలికి ముందుగా ఆధార్ కార్డు అందించి, అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ బాధిత కుటుంబం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది.
దివ్యాంగురాలికి ఆధార్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కుటుంబ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు
ముందుగా ఆధార్ కార్డు మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అనంతరం వైకల్య ధ్రువపత్రం, యూనిక్ డిసెబిలిటీ ఐడీ (UDID) కార్డు తదితర అవసరమైన పత్రాల ప్రక్రియను పూర్తి చేసి, అర్హత నిబంధనల ప్రకారం సామాజిక భద్రత పింఛన్ అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
సంబంధిత అధికారులు స్పందించి దివ్యాంగురాలికి ఆధార్ కార్డు అందించడంతో పాటు, అర్హత మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కల్పించాలని బాధిత కుటుంబం విన్నవించుకోంది
Mani Kumar. B






