తంబళ్లపల్లె - అక్టోబర్ 21 : తంబళ్లపల్లె మండల స్థానిక సంస్థల ఎన్నికల మొదటి రోజు 30 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారి శ్రీధర్, ఏ ఆర్ ఓలు శ్రీనివాసులు, ఉషారాణిలు తెలిపారు. మొత్తం 11 ఎంపీటీసీలకు 30 నామినేషన్లు టిడిపి అభ్యర్థులే వేయడం విశేషం. ఉదయం 10:00 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగింది. పరుసతోపు ఎంపీటీసీగా ఏ భాగ్యలక్ష్మి, ఏ రామలింగారెడ్డి, తంబళ్లపల్లె ఎంపీటీసీగా బండ్లపల్లి చంద్రకళ, కొటాల ఎంపీటీసీగా పోతంశెట్టి సుధారాణి, కన్నె మడుగు ఎంపీటీసీగా దయ్యాల శారదమ్మ, గోపి దీన్నే ఎంపీటీసీగా రెడ్డెం వెంకటరెడ్డి, పరసతోపు ఎంపీటీసీగా డేరంగుల భారతమ్మ, కన్నెమడుగు ఎంపీటీసీగా ఆర్ శారద, కే సుజన, పరసతోపు ఎంపీటీసీగా డేరంగుల రెడ్డప్ప, కన్నె మడుగు ఎంపీటీసీగా దయ్యాల త్రివేణి, ఎద్దుల వారి పల్లి ఎంపీటీసీగా కే కళావతి, గోపి దీన్ని ఎంపీటీసీగా నల్లపురెడ్డి ప్రమీలమ్మ, కొటాల ఎంపీటీసీగా ముంతల శకుంతలమ్మ, కుక్క రాజు పల్లి ఎంపీటీసీగా ఎరపగౌని లక్ష్మీదేవి, ఎద్దుల వారి పల్లి ఎంపీటీసీగా కే రమణమ్మ, కుక్క రాజు పల్లి ఎంపీటీసీగా షేక్ రిహానా, పరసుతోపు, తంబళ్లపల్లె ఎంపీటీసీలుగా గోల్లపల్లి పద్మావతమ్మ రెండు సెట్లు, కుక్క రాజుపల్లి ఎంపీటీసీగా వై వెంకటసుబ్బమ్మ, కన్నెమడుగు ఎంపీటీసీగా బచ్చు నిర్మల, గుండ్లపల్లి ఎంపీటీసీగా ఎం దుర్గాభవాని, నాగేంద్ర నాయుడు, కోటకొండ ఎంపీటీసీగా బుక్కే అనసూయమ్మ, వీరభద్ర నాయక్, కోసువారిపల్లి ఎంపీటీసీగా పి మాలతి, బాలి రెడ్డిగారిపల్లి ఎంపీటీసీగా టి ప్రేమ్ నాథ్, టి కదిరప్ప, కోసువారిపల్లె ఎంపీటీసీగా ఎన్ లైలా లు టిడిపి అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లలో అత్యధికంగా పరుసతోపు, కన్నె మడుగు లో 5 చొప్పున, కుక్క రాజు పల్లి 4, మిగతా 9 ఎంపీటీసీలలో రెండేసి నామినేషన్లు దాఖలు అయ్యాయి