రొంపిచెర్ల - అక్టోబర్ 27 : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహారణ అనంతరం రొంపిచెర్ల మండలం లోని 8 ఎంపీటీసీ స్థానాలకు గాను 8 ఎంపీటీసీ స్థానాలు కూడా ఏకగ్రీవం కావడం తో హర్షం వ్యక్తం 

   తెలుగుదేశం మాజీ ఇంచార్జ్ చల్లా బాబు రెడ్డి చొరవ చూపడం తో నేడు మంగళవారం హరిప్రసాద్, భాస్కరయ్య, వెంకటరమణ, ఈశ్వరమ్మ వేసిన నామినేషన్లు విత్ డ్రా చేసుకోవడం తో అన్నీ ఎంపీటీసీ లు ఏకగ్రీవం అయ్యాయి

     సంపూర్ణ, ముద్దు కృష్ణ, సుప్రియ, మహమ్మద్ రఫీ, ఇమ్రాన్ ఖాన్, షేక్ జహీదా, షేక్ మోహిసీన్, హేమలత లు ఏకగ్రీవం గా ఎన్నికైనట్లు దృవపత్రాలు జారీ చేసిన ఎన్నికల అధికారి మురళి 

    పుంగనూరు టిడిపి మాజీ ఇంచార్జ్ చల్లా బాబు సహకారం తో, ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు చొరవ తో రొంపిచెర్ల లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది తెలియచేసిన నూతనంగా ఎంపికైన ఎంపీటీసీలు 

  మా విజయానికి బాటలు వేసిన టీడీపీ మాజీ ఇంచార్జ్ చల్లా బాబు కు ఎల్లవేళలా రుణపడి ఉంటామని, మా విజయానికి సహకరించిన టిడిపి , జనసేన, బీజేపీ నాయకులకు మరియు కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియచేసారు