తంబళ్లపల్లె - అక్టోబర్ 27 : తంబళ్లపల్లె మండలంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై మంగళవారం అన్నమయ్య జిల్లా ఎన్నికల అబ్జర్వర్ బాలకృష్ణ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల అధికారి శ్రీధర్, ఏ ఆర్ ఓ లు ఉషారాణి, శ్రీనివాసులను నామినేషన్ల ప్రక్రియ, నామినేషన్ల పరిశీలన, తదితర అంశాలపై వారిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉపసంహరణ కార్యక్రమం పై ఎన్నికల అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఆయన వెంట ఎన్నికల అధికారితో పాటు ఏఆర్వోలు, అధికారులు పాల్గొన్నారు
తంబళ్లపల్లె ఎన్నికల ప్రక్రియపై జిల్లా ఎన్నికల అబ్జర్వర్ తనిఖీ
లోకల్ యాడ్స్
వార్తా విభాగం: ఆంధ్రప్రదేశ్ ప్రచురణ తేదీ: 27 October 2026 08:27 PM
Srivani




