తంబళ్లపల్లె - అక్టోబర్ 25 : తంబళ్లపల్లె మండలం లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అరాచక శక్తుల ఆటలు కట్టించి ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కృషి చేస్తామని ఎస్సై టి అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత శుక్రవారం ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలో దాడులకు పాల్పడిన ప్రతి ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. ఇప్పటికే టిడిపి నాయకుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు 14 మంది నిందితులలో దాడులలో పాల్గొన్నారా లేదా అనే విషయంపై డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరా ఫుటేజ్ లు సహకారంతో వివరాలు సేకరిస్తున్నామని దాడులలో పాల్గొన్నట్లు రుజువైతే కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను దాడులు, దౌర్జన్యాలతో అడ్డుకోవాలని చూస్తే ఉపేక్షించేది లేదని ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే దాడుల్లో పాల్గొన్న ఇరువురిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసి కోర్టుకు పంపామని నేరానికి పాల్పడిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసి తంబళ్లపల్లెలో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు